ఆలమూరులో ఫంక్షన్ హాల్ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం

62చూసినవారు
ఆలమూరులో ఫంక్షన్ హాల్ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో గల చెరువుగట్టు వద్ద ఉన్న వైట్ల చిన్న వెంకన్న రైతు భవనం (పెద్ద కళ్యాణ మండపం) పునర్నిర్మాణం పనులను గ్రామ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం టెంకాయ కొట్టి ప్రారంభించారు. పలువురు దాతల సహకారంతో ఈ భవనం పైన రెండవ అంతస్తు నిర్మాణానికి 50 లక్షల నిధులతో పనులను చేపట్టారు. త్వరలోనే ఫంక్షన్ హాల్ ను నిర్మించి ప్రారంభిస్తామని దాతలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్