రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు డాక్టర్ యు. సుభాషిని ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వి. శ్రీనివాసరావు అధ్యక్షతన "సోషల్ మీడియా- సైబర్ క్రైమ్స్" "డిజిటల్ అరెస్ట్" పై బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ న్యాయవాది అల్లు భాస్కర్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.