వాడపల్లి ఆలయ నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరాళం

50చూసినవారు
వాడపల్లి ఆలయ నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరాళం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేం చేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అన్నదాన పథకానికి భక్తులు విరాళాన్ని అందజేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ కిషోర్ కుమార్ తెలిపారు. విశాఖపట్టణం వాస్తవ్వులు కర్రి ఊగంటేశ్వర రావు గుణవతి దంపతులు మరియు కుటుంబ సభ్యులు ఆదివారం స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద భవన నిర్మాణానికి రూ. 1, 00, 116 రూపాయలు విరాళంగా సమర్పించినారు.

సంబంధిత పోస్ట్