ఆంధ్రప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీని బలమైన శక్తిగా నిలిపేందుకు రాష్ట్ర కార్యవర్గం కొన్ని సంస్కరణలను చేపట్టినట్లు కొత్తపేట నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు విజయవాడలో రాష్ట్ర ఇంచార్జ్ అశోక్ సిద్ధార్థ అధ్యక్షతన ఆదివారం బీఎస్పీ విస్తృతస్థాయి సమావేశం జరిగిందన్నారు.