ఆలమూరు మండలంలో నలుగురు సచివాలయ గ్రేడ్-6 కార్యదర్శులు (డిజిటల్ అసిస్టెంట్) లకు గ్రేడ్ 5 కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. ఇటీవల గ్రేడ్-5 కార్యదర్శిలు గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శిలుగా పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మండలంలో పనిచేసే నలుగురికి గ్రేడ్-6 కార్యదర్శులను గ్రేడ్ -5 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.