పాడి రైతులు ఉచిత పశు వైద్య సేవలు వినియోగించుకోవాలని మండపేట ఎస్ఏహెచ్డిసి డిప్యూటీ డైరెక్టర్ బి. గణపతి రావు, ఆలమూరు ఏడి డా. ఎల్. అనిత, మండపేట ఏడి డా. ఎస్. ప్రశాంతి అన్నారు. ఆలమూరు మండలంలోని మడికి శివారు చిలకలపాడు వినాయకుని గుడి సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య ఆరోగ్య రక్షణ శిబిరాన్ని గురువారం వారు ప్రారంభించారు. పశుసంపద పురోభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు