సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోపీ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభ మయ్యాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పోటీలను ప్రారంభించారు. ఎంపీ గంటి హరీష్ మధూర్ ఈత పోటీలను ప్రారంభించారు. అలాగే జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎమ్మెల్యే సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్, ఆకుల రామకృష్ణ పావురాలను ఎగురవేశారు.