భారతదేశ మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని రావుల పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బిహెచ్ఎస్ మూర్తి మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం పటేల్ ఎంతగానో కృషి చేశారన్నారు. తదనంతరం విద్యార్థులతో జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రత, ల కోసం ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు.