ఈనెల 22లోపు స్వయం ఉపాధి పథకాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆలమూరు డిఎల్పిఓ ఎంపీడీవో ఐ. రాజు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగా మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. వెనుకబడిన తరగతులు ఆర్థికంగా వెనుకబడిన వివిధ సామాజికవర్గాల వారికి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు మంజూరు చేస్తుందన్నారు.