రాష్ట్రంలో మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వైసిపి నేతలు, సాక్షి మీడియా, మీడియా ప్రతినిధులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళలు కొత్తపేట పాత బస్టాండ్ వద్ద ధర్నా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని వినతిపత్రం సమర్పించారు.