కొత్తపేట: కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం మానుకోవాలి: అనంత కుమారి

57చూసినవారు
కొత్తపేట: కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం మానుకోవాలి: అనంత కుమారి
టీటీడీలో గో మరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందని అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి శనివారం మండిపడ్డారు. ఈ మేరకు శనివారం కొత్తపేట విలేకరులతో ఆమె మాట్లాడారు. గోశాలలో 100 ఆవులు చనిపోయాయంటూ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తమని అన్నారు. కోట్లాదిమంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్