డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ లో కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధ్యక్షతన ఓఎన్జీసీ సంస్థ ప్రతినిధులతో మంగళవారం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సహచర ఎమ్మెల్యేలతో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. పలు అంశాలపై జరిగిన ఈ సమావేశంలో సిఎస్ఆర్ నిధులు, కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే సత్యానందరావు చర్చించారు.