పార్టీ సభ్యత్వం కార్యకర్తల కుటుంబా లకు భరోసాఅని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధిం చి తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వాడపాలెం గ్రామంలో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ వంద రూపాయలతో సభ్యత్వం తీసుకున్న వారికి అయిదు లక్షల ప్రమాద బీమా, సాధారణ మరణానికి పది వేల రూపాయలు మట్టి ఖర్చుల కోసం ఇస్తారని చెప్పారు.