విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించే ఉద్యోగులకు ఎప్పుడు గుర్తింపు లభిస్తుందని గంటి సర్పంచ్ సాగి బంగారు రాజు అన్నారు. కొత్తపేట మండలం గంటి గ్రామ సచివాలయంలో బదిలీపై వెళ్తున్న పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, విఆర్ఓ రాంబాబును శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి విషయంలో పాలకవర్గానికి కార్యదర్శి వరలక్ష్మి, వీఆర్వో రాంబాబు అందించిన సహకారం అభినంద నీయమన్నారు.