ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారి తెప్పోత్సవం గౌతమీ గోదావరిలో కన్నుల పండుగగా నిర్వహించారు. హంస వాహనంపై శ్రీవారు నదిలో విహరించారు. ముందుగా స్వామి, అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి తెప్పోత్సవం కనులారా వీక్షించారు.