వైసీపీ "యువత పోరు" పేరుతో తలపెట్టిన కార్యక్రమం చాలా హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ కంఠంశెట్టి శ్రీనివాసరావు ఆక్షేపించారు. 2014- 2019 అప్పటి టీడీనీ పాలనలో 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తే, జగన్ రెడ్డి పాలనలో దానిని కుదించి కాలయాపన చేస్తూ 7 లక్షల పేద విద్యార్థులను మోసగించింది మీరు కాదా అంటూ ఘాటుగా విమర్శించారు.