కార్పొరేట్ పాఠశాలల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్య అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మోడేకుర్రులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో విద్యామిత్ర కిట్లను విద్యార్థులకు శనివారం పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.