కొత్తపేట: ఆనందాల ఆటల ఒడిగా సమ్మర్ క్యాంపు

71చూసినవారు
కొత్తపేట: ఆనందాల ఆటల ఒడిగా సమ్మర్ క్యాంపు
ఆనందాల ఆటల ఒడిగా విద్యార్థుల్లో సమ్మర్ క్యాంపు నిలిచిపోతుందని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాష అన్నారు. కొత్తపేట జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ లో ఏప్రిల్ 24 నుండి మే 10 వరకు వేసవి బడి కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈవో భాష పాల్గొన్నారు. విద్యార్థులకు తరగతి వారీగా టెస్టులు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్