తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రజా ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోకులం షెడ్డులను ఎమ్మెల్యే సత్యానందరావు, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బండారు శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు.