కొత్తపేట మండలం మోడేకుర్రు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర కిట్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం అందజేశారు. ఎమ్మెల్యే విద్యార్థులతో ముచ్చటించి, పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని వారికి సూచించారు.