ఆత్రేయపురంలో నాటు సారా విక్రేత అరెస్ట్

53చూసినవారు
ఆత్రేయపురంలో నాటు సారా విక్రేత అరెస్ట్
ఆత్రేయపురం గ్రామానికి చెందిన పెనుమళ్ళ సత్య ప్రసాద్ ఐదు లీటర్ల నాటుసారాతో పట్టుబడినట్లు ఎక్సైజ్ సీఐ కాత్యాయని శనివారం తెలిపారు. ఇతనిని కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జీ.గన్నవరం మండలం పోతవరం శివారు మురుగు కాలువ వద్ద నిలువ చేసిన 250 లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ దాడులలో ఎస్సైలు కె. అన్నవరం, ఎం. రామచంద్రం సిబ్బంది పాల్గొన్నట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్