అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో

72చూసినవారు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో
భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగే అవకాశాలున్న దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని.. కొత్తపేట ఎంపీడీవో మహేశ్వర రావు, తహసిల్దార్ వై. రాంబాబు అధికారులకు సూచించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జిల్లా కొత్తపేట ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఇరిగేషన్, డ్రైన్స్, హెల్త్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వివిధశాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్