పెదపూడి మండలం పుట్టకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఈవోగా వడ్డాది సత్యనారాయణను నియమించారు. ప్రస్తుతం తంటికొండలో విధులు నిర్వహిస్తున్న ఆయనకు అక్కడ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. నేడు (మంగళవారం) ఆయన పుట్టకొండలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సిఫారసుతో ఈ నియామకం జరిగినట్టు సమాచారం.