పారిశుద్ధ్య రహిత గ్రామాల్లో సంపూర్ణ ఆరోగ్యం వెల్లివిరిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో బుధవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సత్యానందరావు, జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ.. గ్రామాల పారిశుధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.