రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న జర్నలిస్టు ఆకుల లోవరాజును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం పరామర్శించారు. రావులపాలెంలోని లోవరాజు స్వగృహానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసు కున్నారు. ఇప్పటికే మూడు ఆపరేషన్లు నిర్వహించబడగా, ఇంకా ఒక శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లు లోవరాజు వివరించారు. అనంతరం ధైర్యం చెప్పి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.