డిమాండ్ కు అనుగుణంగా ఇసుకను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఇసుక తవ్వకాలు నిర్వహించే గుత్తేదారులను ఆదేశించారు. శనివారం రావులపాలెం మండలం ఊబలంక వద్ద ఆర్ ఎస్ ఆర్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఇసుక స్టాక్ పాయింట్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుందన్నారు.