రావులపాలెం బస్ డిపోలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారికి సంక్రాంతి పండుగ సందర్భంగా మైగాపుల గురవయ్య నాయుడు సమకూర్చిన చీరలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజక వర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తుల రాంబాబు, చిలువూరి సతీష్ రాజు, జక్కంపూడి వెంకటస్వామి, కె వి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.