అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో శ్రీలక్ష్మి మందుగుండు సామగ్రి తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన పేలుడులో సామర్లకోటకు చెందిన దేవర నిర్మల (38) అనే మహిళ మృతి చెందారు. ముగ్గరికి తీవ్ర గాయాలు కాగా విశాఖలోని జీజీహెచ్ కు తరలించారు. మహిళ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలు ఎక్స్రేషియా ప్రకటించింది.