భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తూ, అందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తాహశీల్దార్ కేజే ప్రకాశ్ బాబు, ఇన్ ఛార్జ్ డిఎల్పిఓ ఎంపిడివో ఏ రాజు అన్నారు. వారి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సోమవారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా యోగ పై స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.