బాలుడి చికిత్సకు శ్రీ సేవా శక్తి సంఘం రూ. 10 వేలు సాయం

63చూసినవారు
బాలుడి చికిత్సకు శ్రీ సేవా శక్తి సంఘం రూ. 10 వేలు సాయం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం మూలగూడెం గ్రామానికి చెందిన నాలుగు నెలల బాలుడు ఇళ్ల అఖిల్ కు శ్రీ సేవా శక్తి సంఘ సభ్యులు అండగా నిలిచారు. లివర్ మార్పిడి కోసం బాలుడు తల్లిదండ్రులు దాతల సహాయాన్ని అర్ధిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తపేట శ్రీ సేవ శక్తి సంఘ సభ్యులు మంగళవారం బాలుడి తండ్రికి రూ. 10 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్