ఏపీ లో వరద బాధితులను ఆదుకోవడం లో కూటమి ప్రభుత్వ అందిస్తున్న సేవలు అభినందనీయ మని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట లో బుధవారం ఆయన మాట్లాడుతూ వైసిపి నాయకులు బాధితులకు సాయం చేయడం మర్చిపోయి అసంబద్ధ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్య మంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నారన్నారు.