తూ.గో: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్

67చూసినవారు
తూ.గో: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్
డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకులు మెప్మా లోన్ ఛార్జ్ క్రియేషన్ (MLCC) యాప్ ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ యాప్ ద్వాారా స్త్రీనిధి రుణాల వాయిదాలను నగదు రహితంగా చెల్లించవచ్చు. నెలవారీ వాయిదాలను ఆన్‌లైన్‌లో చెల్లించిన వెంటనే మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. వాయిదా చెల్లింపులో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్