ఆలమూరు మండలంలోని చొప్పెల్ల గ్రామంలో శుక్రవారం 216 (ఏ) నెంబర్ గల జాతీయ రహదారి పక్కన బస్ షెల్టర్ లో సుమారు 40 సంవత్సరాలు వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎం. అశోక్ పేర్కొన్నారు. చొప్పెల్ల వీఆర్ఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు ఆలమూరు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.