ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కోసం అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్ల మరమ్మత్తు పనులను పరిశీలించారు. ప్రతి శనివారం వేలాదిమందిగా భక్తులు తరలివస్తున్నారని దానికి తగ్గట్టుగా భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.