ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో స్వామివారి ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల నిర్వహించిన వివిధ సేవల ద్వారా రాత్రి 10 గంటల వరకు స్వామివారి ఆలయానికి రూ 66, 31, 676 ఆదాయం లభించిందని ఆలయ ఈవో చక్రధరరావు తెలియజేశారు.