కొవ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భవాని మాల ధరించిన అప్పల నరసమ్మ (50) మృతి చెందారు. అనకాపల్లికి చెందిన అప్పలనరసమ్మ తన నలుగురు పిల్లలతో కలిసి విజయవాడ దుర్గమ్మ గుడికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళుతుండగా వెనుక నుంచి వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో వెనుక కూర్చున్న ఆమె మృతి చెందగా నలుగురు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.