ముక్కోటి ఏకాదశి సందర్భంగా చాగల్లు శ్రీ సుబ్రహ్మణ్యం దేవాలయం ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం తెల్లవారుజాము నుండి భక్తులు ఉత్తరం ముఖ ద్వారం దర్శనం చేసుకుంటున్నారు. టిడిపి సీనియర్ నాయకులు శ్రీ వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులు ఆళ్ల హరిబాబు దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని స్మరించుకున్నట్టు తెలిపారు.