చాగల్లు మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఎంపీడీవో పి. చంద్రశేఖర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి మునిగిన రోడ్లు, డ్రైనేజీలు, పొలాలు, పంట బొదులలో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్న కారణంగా మెడికల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.