చాగల్లు మండలం దారవరం గ్రామంలో సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలులకు వివరించారు. అలాగే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.