చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంకు చెందిన బాలిక (15) ను నమ్మించి మోసం చేసిన యువకుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన సిద్దార్ధ చంద్ర అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఈనెల 10న ఫిర్యాదు చేసింది. సిద్దార్ధను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు.