చాగల్లు: అత్యాచారం కేసులు నిందితుడికి యావజ్జీవ శిక్ష

82చూసినవారు
చాగల్లు: అత్యాచారం కేసులు నిందితుడికి యావజ్జీవ శిక్ష
బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఏలూరు పోక్సో న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. చాగల్లు మండలం ఊనగట్లకు చెందిన 16ఏళ్ల బాలికను రాజమండ్రి రూరల్ నామవరానికి చెందిన శ్రీను 2017లో అత్యాచారం చేశాడు. దీనిపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో శ్రీనుకు పోక్సో కోర్టు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్