కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలంలో ఆదివారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కె ఎస్ జవహార్ పర్యటించారు. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న జవహర్ అనంతరం టిడిపి సీనియర్ నాయకులు యలమర్తి వి ఆర్ ఎస్ బాబు నివాసం వద్ద గ్రామ నాయకులతో భేటీ అయ్యారు. గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు.