ధవలేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద జరుగుతున్న పంప్ హౌస్ పనులను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ చౌదరి శుక్రవారం పరిశీలిoచారు. వర్షాలు మొదలవుతున్నాయని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ధవలేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద 3 కోట్ల 80 లక్షల రూపాయలతో మురుగునీరు, సంపు మరియు పంప్ హౌస్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే గోరంట్ల నేరుగా పర్యవేక్షించి ఒకటి రెండు రోజుల్లో బేస్మెంట్ పనులు పూర్తి చేయాలని, అధికారులను ఆదేశించారు.