కొవ్వూరు మండలం గోవర్ధనగిరి మెట్ట గ్రామంలో ఎస్సీ పేటలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొoటున్నారు. కాలనీ ప్రజలు ఇంటి వద్ద ఉపయోగించిన నీరు ప్రవహించే మార్గం లేక మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని కోరుతున్నారు.