అమరావతి సెక్రటేరియట్ లో రాష్ట్ర ఐటీ శాఖ, మానవ వనరుల శాఖ నారా లోకేష్ ని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, నూతన ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా తనను నియమించడానికి చేసిన కృషికి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్దతతో పనిచేస్తానని జవహర్ అన్నారు. ఎస్సీ కమిషన్ ద్వారా షెడ్యూల్ కులాల, తెగలకు పేద ప్రజల కోసం పనిచేయాలని నారా లోకేష్ జవహర్ కి సూచించారు.