రైతుల నుంచి నేరుగా మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఉండాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత పేర్కొన్నారు. బుధవారం నిడదవోలు ఉన్న మిల్లర్ల ప్రతినిధులతో ధాన్యం కొనుగోలు పై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాకి 3. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేపట్టిందన్నారు.