కొవ్వూరులోని క్రిస్టియన్ పేటలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు పూరిగుడిసె అగ్నిప్రమాదానికి గురైంది. ఈ అగ్నిప్రమాదంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పాకలో నివసించే వృద్ధురాలి సామాన్లన్నీ కాలి బూడిదయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.