పాడి పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలలో భాగంగా తాళ్లపూడి మండలం పెద్దేవంలో నిర్మించిన మినీ గోకులాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్లవేళలా రైతన్నలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.