కొవ్వూరు డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు వివిధ ప్రమాణాలతో 34 కేసులు నమోదు చేయడం జరిగిందని ఆర్డీవో రాణి సుష్మిత తెలిపారు. శుక్రవారం కొవ్వూరులోని మండల పరిషత్ కార్యాలయంలో డివిజనల్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. తహశ్దీలార్, ఎంపీడీవో, ఎస్. హెచ్. ఓ సంయుక్త పర్యవేక్షణ జరిపి సివిల్ రైడ్స్ పై అవగాహన కల్పించాలని సూచించారు.