కొవ్వూరు నియోజకవర్గంలోని లాంచీల రేవు వద్ద గోదావరి తీరాన ఉన్న చిల్డ్రన్స్ పార్క్ అనాదిగా మారింది. వాకర్స్, చిన్నారులు విహరించే ఈ ప్రాంతంలో పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగి అడవిలా మారింది. ఆటవస్తువులు వాడే ప్రాంతాల్లో విషసర్పాలు సంచరించే ప్రమాదం ఉన్నందున అధికారులు తక్షణం పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.